రైస్‌మిల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-15T05:50:04+05:30 IST

ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో గల విఘ్నేశ్వర రైస్‌మిల్‌ను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు తనిఖీ చేశా రు.

రైస్‌మిల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌
రైస్‌మిల్‌ యజమానులతో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు

ముథోల్‌, డిసెంబరు, 14 : ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో గల విఘ్నేశ్వర రైస్‌మిల్‌ను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు తనిఖీ చేశా రు. పలు వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నుంచి బియ్యం తీసి ప్రభుత్వానికి అప్పజెప్పాలని సూచించారు. అం దులో పనిచేసే సిబ్బంది అందరికి రెండవడోస్‌ వ్యాక్సినేషన్‌ చేయాలని సూ చించా రు. అలాగే రైస్‌మిల్‌ పేరును కనిపించే విధముగా రాయించాలని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ శివప్రసాద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ షేక్‌ ఇమాన్‌బాబా, ఆర్‌ఐ అభిమన్యు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T05:50:04+05:30 IST