నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-05-20T06:45:01+05:30 IST
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మామడ ఎస్సై వినయ్‌కుమార్ అన్నారు.

పెళ్లికి 40కి పైగా హాజరు కావడంతో కేసునమోదు
మామడ, మే 19 : నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మామడ ఎస్సై వినయ్‌కుమార్ అన్నారు. బుధవారం రోజున మామడ మండల కేంద్రా నికి చెందిన సూరపు రవి తన పెళ్లిని కొవిడ్ నిబంధనలు పాటించలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్ 102ని ఉల్లంఘించి 40 మంది కంటే ఎక్కువ మంది అతిథులతో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించడంతో అతనిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ అమలులో ఉన్న రోజుల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ మందితో శుభకార్యాలు కానీ, ఏవైనా కార్య క్రమాలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, వాఽ్యధి నిర్మూలకు ప్రభుత్వంతో సహకరించాలని కోరారు.