స్నూకర్ కేంద్రాలు నిర్వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-02-02T05:03:04+05:30 IST
యువతను చెడు మార్గంలోకి తీసుకెళ్లే స్నూకర్ గేమ్ కేంద్రాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉదయ్‌రెడ్డి హెచ్చరించారు.

ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 1: యువతను చెడు మార్గంలోకి తీసుకెళ్లే స్నూకర్ గేమ్ కేంద్రాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉదయ్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో మూడు చోట్ల నిర్వహిస్తున్న స్నూకర్ గేమ్ కేంద్రాలపై దాడి చేసి స్నూకర్ గేమ్‌కు సంబంధించిన వస్తు, సామగ్రీని ఆధయన స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ యువత ను చెడు మార్గంలో నడిపే కేంద్రాలను నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయన వెంట ఎస్సై నాగ్‌నాథ్, సిబ్బంది ఉన్నారు.