మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-27T07:09:51+05:30 IST

మంత్రి మల్లారెడ్డి తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
నేరడిగొండలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఉట్నూర్‌, ఆగస్టు 26: మంత్రి మల్లారెడ్డి తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ ఆదేశాల మేరకు స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా నుంచి పోలీసు స్టేషన్‌ వరకు కాంగ్రెస్‌ నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ చారులత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌చౌహాన్‌, వెడ్మ బోజ్జులు మాట్లాడుతూ మూడుచింతలపల్లిలో జరిగిన కాంగ్రెస్‌ దీక్షలతో అధికార పార్టీకి వణుకు పుట్టుకుందని అన్నారు. భూముల ఆక్రమణపై జవాబు చె ప్పాల్సిన మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ దూషించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఎస్సై సుబ్బారావుకు వినతి పత్రం సమర్పించారు. మంత్రి మల్లారెడ్డి భూఅక్రమణలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, ఎక్బాల్‌, నర్సయ్య, నిస్సార్‌, అఽశోక్‌, కౌసర్‌, కయ్యూం, జావిద్‌, మల్లారెడ్డి, కళ్యాణ్‌తో పాటు నాగాపూర్‌ సర్పంచ్‌ జాదవ్‌ సునిల్‌, ఆత్రం రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆదిలాబాద్‌ టౌన్‌: మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ చౌక్‌లోని ఆర్‌ అండ్‌బీ విశ్రాంతి భవనం ఎదుట యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సాయిచరణ్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు షేక్‌ నహిద్‌, నియోజక వర్గ అధ్యక్షుడు అర్కత్‌ఖాన్‌, ప్రధాన కార్యదర్శి సామ రుపేష్‌రెడ్డి, నాయకులు శ్రీధర్‌, అఖిల్‌ పాల్గొన్నారు. 

సిరికొండ:  పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామ ని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కంచం లక్ష్మణ్‌ మాట్లాడారు. మంత్రి మల్లా రెడ్డిపై వెంటనే చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యస్‌కే ఇమామ్‌, రంజాన్‌, గంగాధర్‌, ఈశ్వర్‌, సాజిద్‌, శ్యామ్‌సుందర్‌, రమేష్‌, ఇమామ్‌, రమేష్‌, విట్టల్‌, నరేష్‌, నవీన్‌, ప్రకాష్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. 

ఇంద్రవెల్లి: రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గురువారం మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మంత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందులో పార్టీ నాయకులు తులసీరామ్‌, సోమోరే నాగోరావ్‌, మీర్జా యాకుబ్‌ బేగ్‌, వెంకట్‌రావ్‌, సత్యానంద్‌ పాల్గొన్నారు. 

నేరడిగొండ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. విధి రౌడీలా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డిపై వెంటనే చర్యలు తీసు కో వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన ఆత్మగౌరవ బోఽథ్‌ నియోజక వర్గ కోఆర్డినేటర్‌ ఇర్ఫాన్‌అలి, నాయకులు జాదవ్‌ వసంత్‌రావ్‌, ఆడే గజేందర్‌, సర్పంచ్‌ ప్రపుల్‌ చందర్‌రెడ్డి, ఏలేటి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

బోథ్‌: మండల కేంద్రంలోని బస్టాండ్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని విమర్శించిన మంత్రి మల్లారెడ్డి తీరును నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మల్లారెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-08-27T07:09:51+05:30 IST