ప్రమాదవశాత్తు టాటా మ్యాజిక్‌ వాహనం దగ్ధం

ABN , First Publish Date - 2021-07-08T06:31:43+05:30 IST

కుంటాల మండలం అర్లిఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం ఉదయం టాటామ్యాజిక్‌ వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వాహనం దగ్ధం అయింది.

ప్రమాదవశాత్తు టాటా మ్యాజిక్‌ వాహనం దగ్ధం
దగ్ధం అవుతున్న వాహనం

కుంటాల, జూలై 7 : కుంటాల మండలం అర్లిఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం ఉదయం టాటామ్యాజిక్‌ వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వాహనం దగ్ధం అయింది. మండల కేంద్రం కుంటాల వాసి దోనిగామ సంతోష్‌కుమార్‌కు చెందిన టాటా మ్యాజిక్‌ వాహనం మరమ్మత్తుల నిమిత్తం భైంసాకు వెళ్తున్న సమయంలో అర్లి ఎక్స్‌రోడ్డు వద్ద పెట్రోల్‌బంక్‌లో డిజీల్‌ పోసుకునేందుకు వచ్చిన వాహనం డ్రైవర్‌ సీటు కింద నుంచి పొగలు వెలువడుతుండడంతో పరిస్థితి గమనించిన పెట్రోల్‌బంక్‌ సిబ్బంది వాహనాన్ని వెంటనే పెట్రోల్‌ బంక్‌ నుంచి బయటకు తోశారు. అప్పటికే వాహనం చుట్టు మంటలు చెలరేగాయి, ఎయిర్‌ సిలెండర్‌ను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన మంటలు తగ్గక పోవడంతో, పెట్రోల్‌బంక్‌లోని మోటర్‌ ద్వారా మంటలు ఆర్పారు. వాహనంలో ఎవరు లేకపోవడం, పెట్రోల్‌బంక్‌ నుంచి బయటకు వాహనాన్ని తోసేయడంతో పెను ప్రమాదం తప్పింది


Updated Date - 2021-07-08T06:31:43+05:30 IST