పాత ఇల్లు కూల్చుతుండగా ప్రమాదం
ABN , First Publish Date - 2021-12-27T04:43:44+05:30 IST
మండలంలోని డొంగుర్‌గాం గ్రామంలో పాత ఇం టిని కూల్చుతుండగా కూలీపై గోడ పడటంతో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాక్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ గాపూర్(59) కూలీ పని చేస్తూ జీవ నం కొనసాగించేవాడు. ఆదివారం చాక్‌పల్లి గ్రామం నుంచి ఐదుగురు కూలీలతో కలిసి డొంగుర్ గాం గ్రామంలోని బొమ్మెడ భోజన్నకు చెందిన పాత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. గోడను కూల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు షేక్ గాపూర్ పై గోడ కూలడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో భైంసా ఆసుపత్రికి త రలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నారు.

నర్సాపూర్(జి), డిసెంబరు 26: మండలంలోని డొంగుర్‌గాం గ్రామంలో పాత ఇం టిని కూల్చుతుండగా కూలీపై గోడ పడటంతో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాక్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ గాపూర్(59) కూలీ పని చేస్తూ జీవ నం కొనసాగించేవాడు. ఆదివారం చాక్‌పల్లి గ్రామం నుంచి ఐదుగురు కూలీలతో కలిసి డొంగుర్ గాం గ్రామంలోని బొమ్మెడ భోజన్నకు చెందిన పాత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. గోడను కూల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు షేక్ గాపూర్ పై గోడ కూలడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో భైంసా ఆసుపత్రికి త రలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నారు.