వాజ్‌పేయికి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-12-26T03:54:39+05:30 IST

దివంగత మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి జయంతి సందర్భంగా శనివారం కాగజ్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వాజ్‌పేయికి ఘన నివాళి
రెబ్బెనలో వాజ్‌పేయి చిత్రపటానికి పూల మాల వేస్తున్న బీజేపీ నాయకులు


కాగజ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 25: దివంగత మాజీ ప్రధాన మంత్రి  వాజ్‌పేయి జయంతి సందర్భంగా శనివారం కాగజ్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు గోలెం వెంకటేశ్‌,  నాయకులు మాచర్ల శ్రీనివాస్‌, కృష్ణస్వామి, మేడి కార్తీక్‌, కమ్మరి తిరుపతి, మంగ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన మండల కేంద్రంలో బీజేపీ నాయకులు వాజ్‌పేయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌, నాయకులు కృష్ణకుమారి, ఆత్మారాంనాయక్‌, చక్రపాణి, సురేష్‌, రాం బాబు, రాజేష్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T03:54:39+05:30 IST