కొమురం భీంకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-10-21T06:29:15+05:30 IST

జిల్లా అంతటా బుధవారం కొమురం భీం 81వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పించారు.

కొమురం భీంకు ఘన నివాళి
నివాళులు అర్పిస్తున్న ఈశ్వర్‌

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 20 : జిల్లా అంతటా బుధవారం  కొమురం భీం 81వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఎదుట గల కొమురం భీం విగ్రహా నికి మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించా రు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భీంవర్ధంతి కార్య క్రమంలో ఈశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివాసీలకు నిర్మల్‌ పట్టణ కేంద్రంలో ఇళ్లస్థలాలు, ఇళ్లనిర్మాణం కోసం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారి స్థితిగతుల్లో మార్పులు తెస్తామని, పోడుభూముల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండాలన్నారు. నిర్మల్‌లో రాజ్‌గోండ్‌ మ్యూజియం ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. వైస్‌చైర్మన్‌ సాజిద్‌, ఆదివాసీ సంఘాల నాయకులు భీంరావు, సూర్యభాను, పి.రాము, సీడం తిరుపతి, లక్ష్మణ్‌, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము పాల్గొన్నారు. 

కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్‌ భీంరావు ఆదివాసి జిల్లా నాయకుడు, తిరుపతి, తదితరులు ఘన నివాళులు అర్పించారు.  


Updated Date - 2021-10-21T06:29:15+05:30 IST