పేద ప్రజలకు వరం.. సీఎంఆర్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2021-05-02T06:28:42+05:30 IST

పేద ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునప్పటికీ వారికి ప్రభుత్వం ద్వారా అందించే సీఎంఆర్‌ఎఫ్‌ వరంలాంటిదని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు అన్నారు. శనివారం తలమడుగు మండలానికి చెందిన నలుగురు లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఎల్మ శ్రీనివాస్‌రె డ్డి, ఉపాధ్యక్షుడు తోటవెంకటేశ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, జీవన్‌రెడ్డి, రుయ్యాడి సర్పంచ్‌ పోతారెడ్డి పాల్గొన్నారు.

పేద ప్రజలకు వరం.. సీఎంఆర్‌ఎఫ్‌

తలమడుగు, మే1: పేద ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునప్పటికీ వారికి ప్రభుత్వం ద్వారా అందించే సీఎంఆర్‌ఎఫ్‌ వరంలాంటిదని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు అన్నారు. శనివారం తలమడుగు మండలానికి చెందిన నలుగురు లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఎల్మ శ్రీనివాస్‌రె డ్డి, ఉపాధ్యక్షుడు తోటవెంకటేశ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, జీవన్‌రెడ్డి, రుయ్యాడి సర్పంచ్‌ పోతారెడ్డి పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌..

గుడిహత్నూర్‌: ప్రతీ కార్యకర్త కుటుంబానికి టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మన్నూర్‌(సాయినగర్‌)కు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కనక శేషనారాయణ ఇటీవల కరెంట్‌ షాక్‌తో మృతి చెందగా, పార్టీ సభ్యత్వం ఉండడంతో ప్రమాద బీమా చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మనంద్‌, మాజీ జడ్పీటీసీ గిత్తేకేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-02T06:28:42+05:30 IST