పదో తరగతిలో 7090మంది విద్యార్థులు ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2021-05-22T04:09:36+05:30 IST

పదవతరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.

పదో తరగతిలో 7090మంది విద్యార్థులు ఉత్తీర్ణత

ఆసిఫాబాద్‌, మే 21: పదవతరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లాలో 7090మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిం చారు. కరోనా కారణంగా గతేడాది మాదిరిగానే ఈసారి సైతం వార్షిక పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేక తరగతులు నిర్వ హించిన 44రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ ఫార్మేటివ్‌ అసిస్టెట్‌మెంట్‌ పరీక్ష నిర్వహించారు. 20మార్కుల పరీక్షల్లో వచ్చిన మార్కులను అయిందతలు పెంచి వంద మార్కులకు ఫలితాలు సిద్ధం చేశారు. ఈ సారి పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించిన వారందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్లు ఇన్‌చార్జీ డీఈవో ఉదయ్‌బాబు తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల జీపీఏ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

జీపీఏ ప్రకారం..విద్యార్థులు

జిల్లాలో 3347మంది బాలురు, 3743మంది బాలికలు మొత్తం7090 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 1419(బాలురు 623, బాలికలు 796) మంది విద్యార్థులు 10 జీపీఏ, 413(172బాలురు,241బాలికలు) మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 471(189 బాలురు,282బాలికలు) మంది 9.7జీపీఏ, 396(151బాలురు,245బాలికలు)మంది9.5 జీపీఏ, 399(175బాలురు, 224 బాలికలు) 9.3 జీపీఏ, 450(214బాలురు, 236బాలికలు)మంది 9.2జీపీఏ, 438(190బాలురు, 248బాలికలు) 9.0 జీపీఏ, 3104(బాలురు 1633, బాలికలు 1471) మంది విద్యార్థులు జీపీఏ 9.0కంటే తక్కువ శాతం మార్కులు సాధించిన వారు ఉన్నారు.

Updated Date - 2021-05-22T04:09:36+05:30 IST