ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన 43 మందికి జరిమానా
ABN , First Publish Date - 2021-11-26T06:55:46+05:30 IST
ట్రాఫిక్ పోలీసులు మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన 43 మందికి గురువారం జరిమానా విధించారు.

నిర్మల్ కల్చరల్, నవంబరు 25 : ట్రాఫిక్ పోలీసులు మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన 43 మందికి గురువారం జరిమానా విధించారు. ప్రత్యేక తనిఖీల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ట్రాఫిక్ ఎస్సై దే వేందర్ కౌన్సిలింగ్ నిర్వహించి రూ.41,200ల జరిమానా వసూలు చేసి వాహనాలను అప్పగించారు.
ఒకే ద్విచక్ర వాహనంపై 27 పెండింగ్ చలాన్లు
భైంసా రూరల్, నవంబరు 25 : రూరల్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా గురువారం టీఎస్ 18 సీ 6475 నెంబర్ గల ద్విచక్రవాహనంపై 27 పెండింగ్ చలా న్లు ఉండడంతో ఆ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. రూ.9,210 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వాహనాల మీద ఉన్న పెండింగ్ చలాన్‌లను ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. లేకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు.