317 జీవో సవరించాలని విద్యామంత్రికి వినతి

ABN , First Publish Date - 2021-12-15T05:46:48+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను జిల్లాలకు కేటాయింపులో నూతన జిల్లాలను పరిగణలోకి తీసుకొని 317 జీవో సవరించాలని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది.

317 జీవో సవరించాలని విద్యామంత్రికి వినతి
వినతిపత్రం అందిస్తున్న నాయకులు

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 14 : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను జిల్లాలకు కేటాయింపులో నూతన జిల్లాలను పరిగణలోకి తీసుకొని 317 జీవో సవరించాలని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్‌ వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆప్షన్ల స్వీకరించడానికి ముందే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కేటాయించారు. క్యాటగిరి వారీగా వివరాలు ముందుగా ప్రకటించాలన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఉండేలా ఉత్తర్వుల్లో స్పష్టతనివ్వాలన్నారు. అంతర్‌జిల్లా బదిలీల్లో వచ్చిన వారిని యధావిధిగా కొనసాగింపు, ఆరోగ్య విషయంలో స్పష్టతనివ్వాలని కోరారు. అంగవైకల్యులకు రిజర్వేషన్‌, ఒంటిరి వితంతువు మహిళల విషయంలో ప్రిఫెరెన్సీ క్యాటగిరి వర్తింపజేయాలన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన సీనియార్టీ జాబితా సిద్ధం చేయాలని వివరించారు. 

Updated Date - 2021-12-15T05:46:48+05:30 IST