వార్డుల అభివృద్ధికి రూ.25.73 కోట్లు

ABN , First Publish Date - 2021-10-31T07:03:42+05:30 IST

నిర్మల్‌ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసు కుంటున్నామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.

వార్డుల అభివృద్ధికి రూ.25.73 కోట్లు
మున్సిపల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఐకే రెడ్డి

త్వరలో ట్రాఫిక్‌ సమస్య తీరుస్తాం 

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 30 : నిర్మల్‌ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసు కుంటున్నామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం చైర్మన్‌ ఈశ్వర్‌ అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణ, భవిష్యత్‌లో చేపట్ట బోయే అభివృద్ధి పనులపై కౌన్సిలర్లతో చర్చించారు. పలు సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్లు సభ దృష్టి కి తెచ్చారు. సమీకృత మార్కెట్‌ సమస్య పరిష్కరించి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ట్రాఫిక్‌ సమస్యపై పలువురు ప్రశ్నించగా సమీకృత మార్కెట్‌ నిర్మాణం తరువాత రోడ్లపై నిర్వహించే తోపుడుబండ్లకు స్టాల్స్‌ కేటా యించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ పూర్తయిన తర్వాత రూపాయికి నల్లా కనె క్షన్లు అందిస్తామని అన్నారు. అన్నివార్డుల్లో అభివృద్ధి పనుల కోసం రూపాయలు 25.75 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. శివాజీచౌక్‌లో శ్మశానవాటిక రూ. 2.75 కోట్లతో పనులు జరుగుతున్నాయని, 2.73 కోట్లతో అత్యాధునికి టెక్నాలజీతో కూడిన డంపింగ్‌యార్డ్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. పట్టణంలో ఐదు మంచి నీటి ట్యాంకులు నిర్మిస్తామని వివరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం నుండి బంగల్‌పేట్‌ వరకు బీటీ రోడ్డు, సైడ్‌లైన్‌ పనులను పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతీవార్డుకు 25 కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు, కౌన్సిలర్ల సహకారంతో నిర్మల్‌ ను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కార్యాచరణ రూపొం దిస్తున్నామని అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కె. విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, డీఈ నాగేశ్వర్‌రావు, ఏఈ వినయ్‌కుమార్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-31T07:03:42+05:30 IST