కొత్త ప్లాన్‌ను ప్రకటించిన వొడాఫోన్ ఐడియా
ABN , First Publish Date - 2021-09-03T09:27:18+05:30 IST
కొత్త ప్లాన్‌ను ప్రకటించిన వొడాఫోన్ ఐడియా

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటు వొడాఫోన్ ఐడియా రూ. 601 డేటా యాడ్-ఆన్ ప్లాన్ ఒక సంవత్సరం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు అలాగే 75జీబీ డేటా 56 రోజుల పాటు అందించనుంది. ఒక సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌తో పాటు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను వొడాఫోన్ ఐడియా ప్రారంభించింది. రూ. 501 మరియు రూ. 2,595 కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో డేటా కేటాయింపు, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు వంటి ప్రయోజనాలను కూడా వినియోగదారులు పొందుతారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను దాని పాత ప్రీపెయిడ్ ప్లాన్‌లకు జోడించి, వాటి ధరలను పెంచింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించడంతో పాటు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌ను దాని అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ప్రారంభిస్తోంది. రూ. 499తో అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రారంభిస్తోంది.