శాంసంగ్ నెక్‌బ్యాండ్-స్టైల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ విడుదల

ABN , First Publish Date - 2021-02-06T02:25:14+05:30 IST

శాంసంగ్ నెక్‌బ్యాండ్-స్టైల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ విడుదల

శాంసంగ్ నెక్‌బ్యాండ్-స్టైల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ విడుదల

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో 18 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌తో శాంసంగ్ లెవల్ యూ 2 నెక్‌బ్యాండ్-స్టైల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది.


భారత మార్కెట్‌‌లో శాంసంగ్ లెవల్ యూ 2 నెక్‌బ్యాండ్-స్టైల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ రూ.1,999కే లభించనుందని కంపెనీ పేర్కొంది. స్టైల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ బ్లాక్, బ్లూ రంగుల్లో రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. శాంసంగ్ లెవల్ యూ 2 నెక్‌బ్యాండ్-స్టైల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-02-06T02:25:14+05:30 IST