కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్..
ABN , First Publish Date - 2021-02-27T00:26:00+05:30 IST
కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు తీపికబురు అందించింది. ఆకట్టుకునే సరికొత్త ఫీచర్లతో కొత్త శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ32 4జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది.
4జీబీ ర్యామ్‌తోపాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ గెలాక్సీ ఏ32 4జీ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ గెలాక్సీ ఏ32 4జీ స్మార్ట్‌ఫోన్ రూ. 19,9600 ఉంటుంది.