జీపీఎస్తో రెడ్‌మీ స్మార్ట్‌వాచ్‌

ABN , First Publish Date - 2021-05-08T05:48:13+05:30 IST

రెడ్‌మీ ఒక స్మార్ట్‌ వాచ్‌, ఫోన్‌ను ఈ నెల 13న విడుదల చేస్తోంది. ఒకటి ‘రెడ్‌మీ నోట్‌ ఐఓఎస్‌’ ఫోన్‌ కాగా రెండో అదే బ్రాండ్‌తో స్మార్ట్‌ వాచ్‌.

జీపీఎస్తో రెడ్‌మీ స్మార్ట్‌వాచ్‌

రెడ్‌మీ ఒక స్మార్ట్‌ వాచ్‌, ఫోన్‌ను ఈ నెల 13న విడుదల చేస్తోంది. ఒకటి ‘రెడ్‌మీ నోట్‌ ఐఓఎస్‌’ ఫోన్‌ కాగా రెండో అదే బ్రాండ్‌తో స్మార్ట్‌ వాచ్‌. షావోమీ అధికారిక వెబ్‌సైట్‌ కథనం ప్రకారం ఔట్‌డోర్‌ నేవిగేషన్‌ కోసం ఇన్‌బిల్ట్‌ జీపీఎ్‌స/గ్లోనాస్‌ ఈ స్మార్‌ వాచీలో ఉంది. ‘లైట్‌, స్టయిలిష్‌ స్టన్నింగ్‌’ డిజైన్‌కు తోడు 11 స్పోర్ట్‌ మోడ్స్‌ ఉన్నాయి. హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, స్లీప్‌ ట్రాకింగ్‌, గైడెడ్‌ బ్రీతింగ్‌ వంటి ఆరోగ్య హెచ్చరికలూ ఉన్నాయి. 200 వరకు వాచ్‌ ఫేస్‌లతో వస్తోంది. 

Updated Date - 2021-05-08T05:48:13+05:30 IST