కళ్లు జిగేల్ అనిపించేలా రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల..
ABN , First Publish Date - 2021-07-09T01:59:19+05:30 IST
కళ్లు జిగేల్ అనిపించేలా రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. రెడ్‌మి నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ టీజర్ ఫోటోను సంస్థ విడుదల చేసింది. త్వరలో భారత మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఫోన్ విడుదల తేదీని సంస్థ ప్రకటించలేదు. రెడ్‌మి నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సెల్ఫీ కెమెరా, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2- మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మాక్రో సెన్సార్, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది.