కొత్త మోడల్‌లో Realme స్మార్ట్‌ఫోన్స్..
ABN , First Publish Date - 2021-09-03T08:52:13+05:30 IST
కొత్త మోడల్‌లో Realme స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్‌లో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్‌లో సెప్టెంబర్ 9వ తేదీన రియల్‌మి 8ఐ, రియల్‌మి 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. రెండు ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు గత నెలలో రియల్‌మి ఇండియా సిఇఒ ధృవీకరించారు. రియల్‌మి 8ఎస్ 5జీలో 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ల ధరలను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు.