కొత్త మోడల్లో Poco F3 GT స్మార్ట్ఫోన్..
ABN , First Publish Date - 2021-07-24T00:30:27+05:30 IST
కొత్త మోడల్లో Poco F3 GT స్మార్ట్ఫోన్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ పోకో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. భారత మార్కెట్లో కొత్త మోడల్లో పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. 6జీబీ ర్యామ్తోపాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ఫోన్ రూ. 26,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ జూలై 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలై జూలై 26వ తేదీ వరకు ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.