వన్‌ ప్లస్‌ ‘బడ్జెట్‌’ స్మార్ట్‌ఫోన్‌

ABN , First Publish Date - 2021-02-06T05:59:47+05:30 IST

ప్రముఖ కంపెనీ వన్‌ ప్లస్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వస్తోంది. ఒన్‌ప్లస్‌ నోర్డ్‌ ఎన్‌1

వన్‌ ప్లస్‌ ‘బడ్జెట్‌’ స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ కంపెనీ వన్‌ ప్లస్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వస్తోంది. ఒన్‌ప్లస్‌ నోర్డ్‌ ఎన్‌1 5జి పేరిట్‌ ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల అవుతోంది. 299 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.21,800 దీని రేటుగా నిర్ణయించారు. ఒన్‌ప్లస్‌ 9సిరీస్‌ కింద రిలీజ్‌ చేసే యత్నాల్లో కంపెనీ ఉన్నట్టు సమాచారం.




ఈ సిరీస్‌లో మూడు హ్యాండ్‌ సెట్లు వన్‌ ప్లస్‌ 9, వన్‌ ప్లస్‌ 9 ప్రొ, వన్‌ ప్లస్‌ లైట్‌ విడుదల కావచ్చని భావిస్తున్నారు. వీటిలో మొదటి రెండూ బరువు తక్కువేనని, 200 గ్రాములకు లోపే ఉండవచ్చని చెబుతున్నారు. 


Updated Date - 2021-02-06T05:59:47+05:30 IST