కొత్త ఫీచర్లతో హువేయి నోవా 8ఐ స్మార్ట్‌ఫోన్.. ప్రీ-ఆర్డర్‌పై ఆఫర్..
ABN , First Publish Date - 2021-07-07T23:06:35+05:30 IST
కొత్త ఫీచర్లతో హువేయి నోవా 8ఐ స్మార్ట్‌ఫోన్.. ప్రీ-ఆర్డర్‌పై ఆఫర్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హువేయి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అద్భుత ఫీచర్లతో హువేయి నోవా 8ఐ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. 8జీబీతోపాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ హువేయి నోవా 8ఐ స్మార్ట్‌ఫోన్ రూ. 23,300 ఉంటుందని కంపెనీ పేర్కొంది. బ్లూ, మూన్‌లైట్ సిల్వర్, స్టార్రి బ్లాక్ రంగుల్లో హువేయి నోవా 8ఐ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ రోజు నుంచి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఫోన్లను జూలై 21 వరకు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు రూ. 4,600 విలువ గల బహుమతులను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. వినోద బహుమతి ప్యాకేజీని ఇవ్వనున్నట్లు పేర్కొంది.