హువాయ్‌ ఫీబడ్స్‌ 4

ABN , First Publish Date - 2021-08-21T08:21:24+05:30 IST

మార్కెట్లో కుప్పలుతెప్పలుగా కనిపించే ఇయర్‌ ఫోన్స్‌ నిజానికి అయోమయానికి

హువాయ్‌ ఫీబడ్స్‌ 4

టాప్‌ పిక్‌


మార్కెట్లో కుప్పలుతెప్పలుగా కనిపించే ఇయర్‌ ఫోన్స్‌ నిజానికి అయోమయానికి కారణమవుతాయి. వాటిలో ఏది బెస్ట్‌ అన్నది తేల్చుకోవడం కష్టమే. ఎంపిక క్లిష్టం కూడా. 


చెవికి లేదంటే ఓపెన్‌ ఫిట్‌ కోసం మొదట డిజైన్‌ ఎంపిక చేసుకోవాలి. తదుపరి ఏది మనకు సూట్‌ అవుతుందీ చూసుకోవాలి. చెవికి తగ్గట్టు డిజైన్‌తోనూ ఇయర్‌ ఫోన్స్‌ ఈ రోజుల్లో మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కంఫర్ట్‌కే ప్రాధాన్యం. అలా చూసుకున్నప్పుడు ఓపెన్‌ ఫిట్‌ ఇయర్‌ ఫోన్లు బాగుంటాయి. యాక్టివ్‌ నాయిస్‌ టెక్నాలజీలను పట్టుకోగలుగుతున్నాయి. హై ఎండ్‌ ఇయర్‌ ఫోన్ల్‌లోనే ఈ టెక్నాలజీలన్నీ ఉంటాయి. అలా సరిచూసుకున్నప్పుడు హువాయ్‌ ఫ్రీబడ్స్‌ 4 ఎంచుకోదగ్గ రకం. 

ఇయర్‌ ఫోన్లకు సంబంధించి సౌండ్‌ క్వాలిటీ మఖ్యం. 14.3 ఎంఎం డైనమిక్‌ డ్రైవర్‌ హువాయ్‌ ఫ్రీబడ్స్‌ 4కు ఉంది. ఫలితంగా బేస్‌ సౌండ్‌ బాగుంటుంది. బాస్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ఇంజన్‌, బేస్‌ ట్యూబ్‌, స్వతంత్రంగా శబ్దాన్ని పట్టి ఉంచే మదర్‌ బోర్డ్‌ దీని సొంతం. డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ అలాగే పర్సనలైజ్డ్‌ కంట్రోల్స్‌, ఇంటరాక్టివ్‌ ఎక్స్‌పీరియెన్స్‌తో మంచి అనుభవానికి ఇవి బాగుంటాయి.


Updated Date - 2021-08-21T08:21:24+05:30 IST