యూజర్ల డేటా కోసం హ్యాకర్ల ఫేక్‌ యాప్‌

ABN , First Publish Date - 2021-02-06T05:52:32+05:30 IST

వాట్సాప్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టే యత్నంలో భాగంగా హ్యకర్లు నకిలీ ఐఔస్‌ యాప్‌ను సృష్టించారు. ‘

యూజర్ల డేటా కోసం హ్యాకర్ల ఫేక్‌ యాప్‌

 వాట్సాప్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టే యత్నంలో భాగంగా హ్యకర్లు నకిలీ ఐఔస్‌ యాప్‌ను సృష్టించారు. ‘సై4గేట్‌’ అనే ఇటాలియన్‌ నిఘా సంస్థ దీన్ని రూపొందించినట్లు ‘సిటిజన్‌ లాబ్‌’, ‘మదర్‌బోర్డ్‌’  నివేదిక తెలిపింది.  పోలీసులు, ఇతర నిఘా సంస్థలతో కలిసి సదరు సంస్థ పనిచేస్తోంది. ఎంపిక చేసిన వ్యక్తుల సమాచారాన్ని ఈ పద్ధతిలో సేకరిస్తోంది. మాల్వేర్‌ను ఐఫోన్లలోకి  పంపడం ద్వారా ఈ అనుచిత చర్యకు పాల్పడుతోంది.


అప్‌డేట్‌ అయిన ఐఔస్‌ 14.4తో ఇందుకు అవకాశం కలుగుతోంది. ఒకేఒక్క క్లిక్‌తో అటాక్‌ చేస్తోంది. లేటెస్ట్‌ ఐఔస్‌కు అప్‌డేట్‌ అయితే రక్షణ ఉంటుందని ‘జెకాప్స్‌’ ట్వీట్‌ చేసింది. ఐఫోన్‌ వినియోగదారులు స్టోర్‌లోకి వెళ్ళి వాట్సాప్‌ యాప్‌ ఒరిజనల్‌ను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవడమే ఉత్తమం. ‘వైస్‌’ నివేదిక ప్రకారం ప్రత్యేక కాన్ఫిగరేషన్‌తో ఉన్న యాప్‌ను వినియోగదారులు తీసుకునేలా ఆకట్టుకుంటోంది. తద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఆటాకర్లకు అందజేస్తోంది.


Updated Date - 2021-02-06T05:52:32+05:30 IST