తొలి గేమింగ్ ఈవెంట్ FBGamingPressStartను ప్రారంభించిన ఫేస్బుక్
ABN , First Publish Date - 2021-10-22T02:34:10+05:30 IST
తొలి గేమింగ్ ఈవెంట్ FBGamingPressStartను ప్రారంభించిన ఫేస్బుక్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఫేస్బుక్… తన మొట్టమొదటి గేమింగ్ ఈవెంట్ FBGamingPressStart ను ఇండియాలో నిర్వహించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వర్చుల్ ఈవెంట్లో గేమ్ డెవలపర్లు, పబ్లిషర్స్ మరియు క్రియేటర్స్ పాల్గొన్నారు. వారంతా ఫేస్బుక్లో వారి గేమింగ్ ఉనికిని ఎలా నిర్మించారో, ఎలా స్కేల్ చేసుకున్నారో, అలాగే కొత్త ప్రేక్షకులను కనుగొని వారి కమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ ఈవెంట్లో ఫేస్బుక్ గేమింగ్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జియో హంట్, ఫేస్బుక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ శ్రీ అజిత్ మోహన్, ఫేస్బుక్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ మనోహర్ హోచందాని పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు.
ఇక ఈవెంట్ మొదటి రోజు, #FBGamingPressStart ప్రధానంగా మోనటైజేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మరియు ఫేస్బుక్ ఇన్స్టంట్ గేమ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా గేమ్స్‌ని సూపర్ఛార్జ్ చేయడానికి ఫేస్బుక్ ఎలా ఉపయోగపడుతుందనే దానిపై గేమింగ్ పబ్లిషర్స్, మరియు డెవలపర్లకు అందించడంపై దృష్టి సారించింది. రెండో రోజు క్రియేటర్స్, పబ్లిషర్స్ మరియు ఈస్పోర్ట్స్ కంపెనీలు ఫేస్బుక్ గేమింగ్ క్రియేటర్ ప్రోగ్రామ్‌ల యొక్క రింగ్-సైడ్ వ్యూను మరియు ఔత్సాహిక సృష్టికర్తలు మరియు ప్లాట్‌ఫారమ్‌పై సృష్టికర్తలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి వీలుగా మోనటైజేషన్ సాధనాలను అందించాయి.