దేశీ ఆడియో చాట్ యాప్
ABN , First Publish Date - 2021-05-08T05:44:28+05:30 IST
‘ఫైర్‌సైడ్’ షార్ట్ వీడియో మేకింగ్‌లో దూసుకువెళుతున్న దేశీయ ‘చింగారి’ - ‘ఫైర్‌సైడ్’ పేరిట యాప్‌ను విడుదల చేసింది.

‘ఫైర్‌సైడ్’ షార్ట్ వీడియో మేకింగ్‌లో దూసుకువెళుతున్న దేశీయ ‘చింగారి’ - ‘ఫైర్‌సైడ్’ పేరిట యాప్‌ను విడుదల చేసింది. ప్రస్తుత సంక్షోభంలో మనుషులు దగ్గరయ్యేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. తమను అభిమానించే వ్యక్తులు వాయిస్ వినేందుకు, మనుషులు మరింత సన్నిహితమయ్యేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ సీఈఓ, కోఫౌండర్ సుమిత్ ఘోష్ వెల్లడించారు. ఈ యాప్‌లో వర్చ్యువల్ లొకేషన్ అంటే ఒక రూమ్‌లో మాదిరిగా కూర్చుని పరస్పరం ఆటలు, మాటలు, పాటలతో ఆనందించే అనుభూతిని పొందవచ్చు. ఒకేరకమైన మనస్తత్వం, ఆలోచనలు ఉన్న వ్యక్తులు అనేకానేక విషయాలను పరస్పరం పంచుకోవచ్చు.
ముఖ్యంగా దూరంగా ఉన్న బంధువులతో మానసికంగా దగ్గర కావచ్చు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడివారైనా, మరెక్కడి నుంచైనా అర్థవంతమైన చర్చలు జరుపుకోవచ్చు, క్విజ్లు నిర్వహించుకోవచ్చు. మాటలు, పాటలు, డ్యాన్స్‌లతో అలరించుకోవచ్చు. విద్యా సంబంధ చర్చలు, ఇంకా పనికి వచ్చే వేటినైనా దీంతో షేర్ చేసుకోవచ్చు. మొత్తమ్మీద మనుషులు, మనుషుల మధ్య దూరం పెరగకుండా చూసుకునేందుకు ఈ ‘ఫైర్‌సైడ్’ ఎంతగానో ఉపయోగ పడనుంది.