డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మార్పులు

ABN , First Publish Date - 2021-08-21T08:19:53+05:30 IST

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ మన దేశంలో జనాదరణ పొందిన ఓటీటీ వేదిక. వచ్చే నెల

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మార్పులు

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ మన దేశంలో జనాదరణ పొందిన ఓటీటీ  వేదిక. వచ్చే నెల మొదటి తేదీ నుంచి ఉచిత, పెయిడ్‌  వెర్షన్లుగా మారుతోందని సమాచారం. ఇది ఆఫర్‌ చేసే వీఐపీ  వార్షిక ప్లాన్‌ రూ.399.  ఈ ఆఫర్‌ కింద దేశీయ కంటెంట్‌కు తోడు హెచ్‌డి క్వాలిటీ వీడియో డోల్‌బై 5.1 ఆడియో సౌలభ్యం ఉంటుంది. ప్రీమియమ్‌ ప్లాన్‌ రూ.1,499. యావత్తు కంటెంట్‌తోపాటు 4కె క్వాలిటీ వీడియో డోల్‌బై 5.1 ఆడియో, రెండు స్ర్కీన్లపై కంటెంట్‌ను చూసే సామర్థ్యం లభిస్తుంది. 


మొబైల్‌ విషయంలో వార్షిక ప్లాన్‌ రూ.499. సూపర్‌ ప్లాన్‌ రూ.899 కాగా ప్రీమియం ప్లాన్‌ రూ.1,499. కంటెంట్‌ విషయానికి వస్తే, ఈ మూడింటిలో దేనినైనా వినియోగదారులు ఎంచుకోవచ్చు. క్రీడల నుంచి ఇంగ్లీష్‌ అలాగే దేశీయ భాషల్లో సినిమాల వరకు అన్నీ వీటిలో లభ్యమవుతాయి. 


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ మొబైల్‌ ప్లాన్‌

యాడ్‌ సపోర్టెడ్‌ వార్షిక ప్లాన్‌ రూ.499. ఏదో ఒక డివైస్‌పై ఒకసారి లాజిన్‌ కావచ్చు. 720పి వీడియో క్వాలిటీ, స్టీరియో క్వాలిటీ సౌండ్‌.


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సూపర్‌ ప్లాన్‌

యాడ్‌ సపోర్టెడ్‌ వార్షిక ప్లాన్‌ రూ.899. రెండు డివైస్‌లపై పొందవచ్చు. 1080పి వీడియో క్వాలిటీ, డోల్‌బై 5.1 సౌండ్‌ యాక్సెస్‌ పొందవచ్చు. 


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ప్రీమియమ్‌

యాడ్‌ సపోర్టెడ్‌ వార్షిక ప్లాన్‌ రూ.1,499. నాలుగు డివైస్‌లపై పొందవచ్చు. 4కె వీడియో క్వాలిటీ, డోల్‌బై 5.1 సౌండ్‌ యాక్సెస్‌ చేసుకోవచ్చు.


Updated Date - 2021-08-21T08:19:53+05:30 IST