సొంతంగా కాల్స్ చేసేస్తున్న గూగుల్ పిక్సెల్ ఫోన్లు!
ABN , First Publish Date - 2021-12-17T02:25:16+05:30 IST
టెక్కూ నిక్కూ రెండూ కలిస్తే టెక్నిక్... అన్నాడొకాయన... మరి టెక్నాలజీలో ఎంతో ఎదిగిపోయిన గూగుల్ వాళ్లకి టెక్కే కాదు.. నిక్కు కూడా కాస్త ఎక్కువే అంటారు. టెక్నోరంగంలో మేం ఎన్నో అద్భుతాలు సాధించాం...
టెక్కూ నిక్కూ రెండూ కలిస్తే టెక్నిక్... అన్నాడొకాయన... మరి టెక్నాలజీలో ఎంతో ఎదిగిపోయిన గూగుల్ వాళ్లకి టెక్కే కాదు.. నిక్కు కూడా కాస్త ఎక్కువే అంటారు. టెక్నోరంగంలో మేం ఎన్నో అద్భుతాలు సాధించాం. అందరికంటే మేమే గొప్ప అన్నట్టు - గూగుల్ ఒకోసారి రెచ్చిపోతూ ఉంటుంది. కానీ - ఒకోసారి - గజ ఈత గాడు కాస్తా... పిల్లకాలువలో జారిపడ్డట్టు... గూగుల్ లాంటి ఘనాపాఠీలు చిన్న చిన్న విషయాల్లో బోల్తా పడిపోతతుంటారు. గూగుల్ రీసెంట్‌గా చాలా ప్రెస్టీజియస్ గా ఓ ఫోన్ రిలీజ్ చేసింది. అబ్బో గూగుల్ నించి ఫోన్ అనగానే జనం అబ్బో అనుకున్నారు. కానీ తీరా చూస్తే … ప్రతిష్ఠాత్మకమైన ఆ ఫోన్లో ప్రామినెంట్ బగ్స్ కనిపిస్తున్నాయి. అవి గూగుల్ని నవ్వులపాలు చేస్తున్నాయి.