మేజర్ హెల్త్ ఫీచర్‌తో యాపిల్ వాచ్!
ABN , First Publish Date - 2021-05-08T05:47:06+05:30 IST
ఆరోగ్యంపై శ్రద్ధ జనాల్లో పెరుగుతుండటంతో సంబంధిత పరిశోధనలు అలాగే ఉత్పత్తులూ అధికమవుతున్నాయి.

ఆరోగ్యంపై శ్రద్ధ జనాల్లో పెరుగుతుండటంతో సంబంధిత పరిశోధనలు అలాగే ఉత్పత్తులూ అధికమవుతున్నాయి. సరికొత్త హెల్త్ ఫీచర్‌తో వచ్చే ఏడాది స్మార్ట్ వాచీని విడుదల చేసే యత్నంలో యాపిల్ ఉన్నట్టు సమాచారం. ఈసీజీ, ఎస్పీఓ2 ట్రాకింగ్, హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లనీ ఈ కొత్త స్మార్ట్ వాచీలో ఉంటాయి. బ్రిటీష్ ఎలకా్ట్రనిక్ స్టార్టప్ ‘రాక్‌లీ ఫొటోనిక్స్’ తదుపరి జనరేషన్ సెన్సర్లను అభివృద్ధిపరుస్తోంది. యాపిల్ వచ్చే ఏడాది విడుదల చేసే స్మార్ట్ వాచీల్లో ఆ సెన్సర్లు ఉంటాయి. యాపిల్ తమ అతి పెద్ద కస్టమర్ అని సదరు స్టార్టప్ తెలిపినట్టు ‘ద టెలిగ్రాఫ్’ వెల్లడించింది.
మానవ దేహంపై దండెత్తడానికి వీలుకాని సెన్సింగ్ ఇప్పటికీ సవాలు విసురుతోంది. దానిపై పరిశోధన జరుగుతోంది. గ్లూకోజ్ లెవెల్స్, ఆల్కహాల్ లెవెల్స్, బ్లడ్ ప్రెజర్... ఇలా అన్నింటిపై స్టార్టప్ వర్క్ చేస్తోంది. అయితే ఈ విషయాల్లో వేటినీ అటు స్టార్టప్ కంపెనీ లేదా ఇటు యాపిల్ ఏ రకంగానూ నిర్ధారించటం లేదు.