భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సెల్..

ABN , First Publish Date - 2021-07-08T22:14:04+05:30 IST

భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సెల్..

భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సెల్..

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఈ-కామర్స్ సంస్థ పేర్కొంది. 300 కొత్త ఉత్పత్తులను అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో అమ్మకాలకు పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. జూలై 26వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమవుతోందని సంస్థ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్స్, టీవీలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రైమ్ డే సేల్ కేవలం రెండు రోజుల కార్యక్రమం మాత్రమే అని అమెజాన్ పేర్కొంది. జూలై 26 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమై జూలై 27తో ముగుస్తోందని ఈ-కామర్స్ సంస్థ స్పష్టం చేసింది.

Updated Date - 2021-07-08T22:14:04+05:30 IST