కొత్త ఆఫర్లను ప్రకటించిన Airtel
ABN , First Publish Date - 2021-09-03T09:13:32+05:30 IST
కొత్త ఆఫర్లను ప్రకటించిన Airtel

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ భారతీఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ రూ. 499, రూ. 699, మరియు రూ. 2,798 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కూడిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఒక సంవత్సరంపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌తో మూడు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌తో మూడు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్‌లోని కస్టమర్ల కోసం ఓటీటీ సేవను రూ. 499తో ప్రారంభించింది. జియో మరియు వీఐ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌తో ప్లాన్‌లను అందిస్తున్నాయి.