అద్భుత ఫీచర్లతో ఎసెర్ ల్యాప్‌టాప్..
ABN , First Publish Date - 2021-02-27T01:22:58+05:30 IST
అద్భుత ఫీచర్లతో ఎసెర్ ల్యాప్‌టాప్..

న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఎసెర్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో ఎసెర్ ఆస్పైర్ 7 ఏఎండీ రైజెన్ ల్యాప్‌టాప్ విడుదల చేసింది. భారత మార్కెట్‌లో 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎసెర్ ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది.
భారత మార్కెట్‌లో ఎసెర్ ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ ధర రూ. 54,990 ఉంటుంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ 10 గంటలపాటు పని చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది.