బైక్ కొంటామంటూ షోరూమ్‌కు వెళ్లి.. ఊహించని షాకిచ్చిన యువ జంట.. సీసీ కెమెరాలో..

ABN , First Publish Date - 2021-07-08T17:36:17+05:30 IST

మీరు `మన్మథుడు` సినిమా చూశారా? ఆ సినిమాలో హీరో నాగార్జున, బ్రహ్మానందం ఓ చెప్పుల షాపులో బూట్లు తీసుకుని పరిగెత్తి చూస్తామని చెప్పి పారిపోతారు.

బైక్ కొంటామంటూ షోరూమ్‌కు వెళ్లి.. ఊహించని షాకిచ్చిన యువ జంట.. సీసీ కెమెరాలో..

మీరు `మన్మథుడు` సినిమా చూశారా? ఆ సినిమాలో హీరో నాగార్జున, బ్రహ్మానందం ఓ చెప్పుల షాపులో బూట్లు తీసుకుని పరిగెత్తి చూస్తామని చెప్పి పారిపోతారు. అదే ట్రిక్కును ఉపయోగించి పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ జంట బైక్‌తో సహా పరారైంది. వారు వెనక్కి తిరిగి వస్తారని చూస్తూ కూర్చున్న షాప్ యజమానికి నిరాశే మిగిలింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. 


జలంధర్‌లోని `శివ ఆటో డీల్` షోరూమ్‌కు బుధవారం ఓ జంట బైక్ కొంటామంటూ వచ్చింది. ఆ షాప్ ఓనర్ సంజీవ్ వారికి పల్సర్ బైక్ చూపించి దాని విశేషాలు వివరించాడు. వారు టెస్ట్ డ్రైవింగ్ చేస్తామన్నారు. అందుకు సంజీవ్ అంగీకరించడంతో వారిద్దరూ ఆ బైక్‌ను తీసుకెళ్లారు. అయితే ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో సంజీవ్ పోలీసులను ఆశ్రయించాడు. షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. వారు తీసుకెళ్లిన బైక్ నెంబర్, వారి ఫొటోలు సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపించారు. 

Updated Date - 2021-07-08T17:36:17+05:30 IST