ఈ సబ్బు రేటు ఎన్ని లక్షలో తెలుసా?
ABN , First Publish Date - 2021-10-03T01:51:48+05:30 IST
ఈ సబ్బు రేటు ఎన్ని లక్షలో తెలుసా?
లెబనాన్: సబ్బు ఖరీదు రూ.100 కాదు వేలు కాదు ఏకంగా లక్షల రూపాయలు. లెబనాన్‌లోని ట్రిపోలిలో ఉన్న చిన్న కుటుంబం ఇటువంటి సబ్బులు తయారు చేస్తున్నారు. ఈ ఖరీదైన సబ్బులను బాడర్ హాసన్ అండ్ సన్స్ కుటుంబం తయారు చేస్తోంది. ఈ సబ్బులను ది ఖాన్ అల్ సాబిన్ పేరుతో విక్రయిస్తుంటారు. ఈ సబ్బుల వ్యాపార చరిత్ర 15వ శతాబ్దానికి చెందింది. బాడర్ హాసన్ అండ్ సన్స్ ఈ సబ్బులను చేతులతో తయారు చేస్తారు. ఇవి నూనెలు, సహజ సువాసనలతో ఉంటాయి. ఈ రకాల లగ్జరీ సబ్బులు చర్మ సంరక్షణకు ఉపయోగిస్తారు. ఈ లగ్జరీ సబ్బులు యూఐఈలోని కొన్ని ప్రత్యేకమైన దుకాణాల్లో అమ్ముతారు.
అయితే ఈ సబ్బులను ముఖ్యమైన వ్యక్తులకు, ఇతర ప్రత్యేక అతిథులకు మాత్రమే అందించబడతాయి. ఈ ఖరీదైన సబ్బులను 2013లో మొదటి సారిగా తయారు చేశారు. దీనిని కథార్ ప్రధమ మహిళకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అత్యంత ఖరీదైన ఈ సబ్బులో బంగారం, డైమండ్ పౌడర్‌తో నింపబడి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు మొదట్లో చాలా ఖరీదైన జున్ను ముక్కగా ఉండేది. కానీ ఇప్పడది మెరుగుపర్చబడింది.
ది ఖాన్ అల్ సాబిన్ కుటుంబానికి చెందిన వారు ఈ ఖరీదైన సోప్స్‌తో పాటు స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ సబ్బు తయారీలో 17 గ్రాముల బంగారపు పౌడర్‌తో పాటు డైమండ్స్ పొడి, సేంద్రియ తేనె, స్వచ్ఛమైన ఆలీవ్ నూనె కర్జూరం మొదలైన వాటిని కూడా జోడిస్తారు. బంగారపు పొడి, వజ్రాల పౌడర్ వాడినందున ఈ సబ్బు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బుగా పెరుపొందింది. ఈ సబ్బు ధర 2,800 డాలర్లు. భారత కరెన్సీలో 2 లక్షలకు పైగా ఉంటుంది. ఈ సబ్బులు అధ్యాత్మక శక్తిని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతత చేకూర్చుతుందని తయారీదారులు తెలిపారు.