ఛీ.. ఛీ.. వీడసలు భర్తేనా..? భార్య అశ్లీల వీడియోలను నెట్టింట పోస్ట్ చేశాడు.. ఆమెకు ఆలస్యంగా తెలిసి..

ABN , First Publish Date - 2021-11-09T16:14:12+05:30 IST

అడిగినంత కట్నం తేలేదనే అక్కసుతో భార్యను అభాసుపాలు చేశాడు.

ఛీ.. ఛీ.. వీడసలు భర్తేనా..? భార్య అశ్లీల వీడియోలను నెట్టింట పోస్ట్ చేశాడు.. ఆమెకు ఆలస్యంగా తెలిసి..

అడిగినంత కట్నం తేలేదనే అక్కసుతో భార్యను అభాసుపాలు చేశాడు. మగ బిడ్డను ప్రసవించలేదనే కోపంతో పాశవికంగా ప్రవర్తించాడు. ఫోన్ ద్వారా ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పడమే కాకుండా.. ఆమెకు సంబంధించిన అసభ్యకర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. చివరకు కోలుకుని పోలీసులను ఆశ్రయించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌కు చెందిన యాస్ మహమ్మద్ అనే వ్యక్తి బాధిత మహిళ (32)ను 2014లో వివాహం చేసుకున్నాడు. రూ.5 లక్షలు అదనపు కట్నం కావాలని అడిగాడు. అయితే మహిళ కుటుంబం ఆ కట్నం డబ్బును ఇవ్వలేకపోయింది. దీంతో అత్తింటి వారు ఆమెను వేధించడం ప్రారంభించారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. దానికి తోడు ఆమె ఆడపిల్లను ప్రసవించడంతో భర్త మరింత పాశవికంగా ప్రవర్తించాడు. ఆమెకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. 


అంతేకాదు ఆమెకు సంబంధించిన ఓ అసభ్యకర వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టేశాడు. ఆ విషయం తెలుసుకున్న మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-11-09T16:14:12+05:30 IST