విమానం గాల్లో ఉండగా.. మహిళ ఉన్నట్టుండి సైకోలా..

ABN , First Publish Date - 2021-07-13T02:00:42+05:30 IST

విమానం గాల్లో ఎగురుతుండగా తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికురాలిని సిబ్బంది సీటుకు గమ్ టేప్‌తో కట్టేసి కూర్చోపెట్టారు. అమెరికా ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానం గాల్లో ఉండగా.. మహిళ ఉన్నట్టుండి సైకోలా..

వాషింగ్టన్: విమానం గాల్లో ఎగురుతుండగా తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికురాలిని సిబ్బంది సీటుకు గమ్ టేప్‌తో కట్టేసి కూర్చోపెట్టారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన గంట తరువాత..ఆమె అకస్మాత్తుగా సిటులోంచి లేచి.. విమానం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిందని సిబ్బంది తెలిపారు. కిందకు దిగిపోతానంటూ తెగ హడావుడి చేసిందని, తాము ఆమెను శాంతిపజేసేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందని వాపోయారు. ఈ క్రమంలో ఆమె సిబ్బందిలో ఒకరి చేయిని కొరికి నానా గలాటా సృష్టించడంతో మరో గత్యంతరం లేక ఆమెను సీటుకు గమ్‌ టేప్‌తో కట్టేసి కూర్చోబెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 


ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే..విమాన సిబ్బంది ఆ మహిళను ఇలా సీటుకు కట్టేయడం సబబు కాదని, మరోలా ఆమెను అదుపు చేసి ఉంటే బాగుండేదని సాటి ప్రయాణికుల్లో కొందరు అభిప్రాయపడ్డారు. కాగా.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇలా చేయాల్సి వచ్చిందని పైలట్ వివరణ కూడా ఇచ్చారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1774 విమానం గతవారం డల్లాస్ ఫోర్ట్ వర్త్‌ నుంచి షార్లెట్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.   

Updated Date - 2021-07-13T02:00:42+05:30 IST