చెల్లితోనే సంబంధం.. వాళ్లే నా భర్తను చంపారంటూ కేసు పెట్టిన భార్య.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-07-24T20:12:44+05:30 IST

వరసకు చెల్లి అయ్యే మహిళతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కుటుంబ సభ్యులే నా భర్తను చంపేశారు. దయచేసి కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చెయ్యండి

చెల్లితోనే సంబంధం.. వాళ్లే నా భర్తను చంపారంటూ కేసు పెట్టిన భార్య.. చివరకు ఊహించని ట్విస్ట్..!

`వరసకు చెల్లి అయ్యే మహిళతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కుటుంబ సభ్యులే నా భర్తను చంపేశారు. దయచేసి కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చెయ్యండి` అంటూ ఓ మహిళ ఈ నెల 17న ఛత్తీస్‌గఢ్‌లోని సనావాల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించిన పోలీసులు దర్యాఫ్తు మొదలుపెట్టారు. ఆ దర్యాఫ్తులో అసలు విషయం బయటపడింది. ఆ భార్యే భర్తను చంపేసి తప్పుడు కథ అల్లిందని తేలింది. 


సదరు మహిళ తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కోపంతో అతడిని చంపెయ్యాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఓ పథకం రచించింది. ఈ నెల 17న భర్త చేత బాగా మద్యం తాగించి అతడికి వరసకు సోదరి అయ్యే మహిళ దగ్గర అసభ్యంగా ప్రవర్తించేలా ప్రేరేపించింది. దీంతో సదరు మహిళ కోపంతో తన ఇంటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత భార్యే భర్త గొంతు కోసి చంపేసింది. 


అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త సోదరి కుటుంబంపై ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు కేసు దర్యాఫ్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మృతుడి భార్య వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను విచారించగా ఆమె నిజం అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమె అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-07-24T20:12:44+05:30 IST