21 ఏళ్ల కుర్రాడి మాయలో పడి భర్తను వదిలేసిన ఈ 30 ఏళ్ల మహిళ కథ ఎలా ముగిసిందంటే..

ABN , First Publish Date - 2021-08-10T19:14:22+05:30 IST

ఆమె వివాహిత, గృహిణి.. 21 ఏళ్ల కుర్రాడి మాయలో పడి భర్తను వదిలేసింది..

21 ఏళ్ల కుర్రాడి మాయలో పడి భర్తను వదిలేసిన ఈ 30 ఏళ్ల మహిళ కథ ఎలా ముగిసిందంటే..

ఆమె వివాహిత, గృహిణి.. 21 ఏళ్ల కుర్రాడి మాయలో పడి భర్తను వదిలేసింది.. ఆ కుర్రాడితో కలిసి వెళ్లిపోయింది.. అతడిని ఓ గుళ్లో వివాహం చేసుకుని కాపురం పెట్టింది.. అయితే ఆ కుర్రాడికి అప్పటికే ఓ గాళ్‌ఫ్రెండ్ ఉంది.. లాక్‌డౌన్ కారణంగా ఆమె తన స్వగ్రామానికి వెళ్లింది.. ఆమె తిరిగి వస్తున్నదని తెలియడంతో ఆ కుర్రాడు తనతో పాటు వచ్చేసిన వివాహితను వదలించుకోవాలనుకున్నాడు.. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.. దక్షిణ ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీకి చెందిన అనూజ్ కుమార్ (21) ఓ యువతితో ప్రేమలో పడి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.  అయితే లాక్‌డౌన్ కారణంగా ఆ యువతి గతేడాది తన స్వగ్రామానికి వెళ్లింది. ఆమె లేకపోవడంతో అనూజ్ ఓ వివాహితను ప్రేమలో దింపాడు. అనూజ్ ప్రేమలో పడిన ఆ వివాహిత తన భర్తను, కుటుంబాన్ని వదిలేసి వచ్చేసింది. అనూజ్‌ను గుళ్లో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. అయితే గాళ్‌ఫ్రెండ్ తిరిగి వచ్చేస్తున్నట్టు సమాచారం అందడంతో అనూజ్ ఈమెను అడ్డు తప్పించాలనుకున్నాడు. స్నేహితులు రంజాన్, నౌషద్ సహాయంతో ఈమెను చంపేందుకు కుట్ర పన్నాడు. 


గత నెల 30న ముగ్గురూ ఆమెను అడవిలోకి తీసుకెళ్లి చంపేశారు. అనంతరం వారే తమకు ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫోన్ చేశారు. అడవిలో ఓ మహిళ మృతదేహాన్ని చూశామని చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు బాధిత మహిళ ఈ ముగ్గురితో కలిసే అడవిలోకి వెళ్లినట్టు గుర్తించారు. వీరిని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో సోమవారం వీరిని అరెస్ట్ చేశారు. Updated Date - 2021-08-10T19:14:22+05:30 IST