ఆమె ఇతరులు విప్పిన దుస్తులు ధరించి.. వయ్యారాలు ఒలికిస్తుంటుంది.. కారణమడిగితే కేక పుట్టించే సమాధానమిచ్చింది..

ABN , First Publish Date - 2021-10-31T15:21:02+05:30 IST

ఆన్‌లైన్ షాపింగ్, విండో షాపింగ్‌లాంటి పద్ధతులలో..

ఆమె ఇతరులు విప్పిన దుస్తులు ధరించి.. వయ్యారాలు ఒలికిస్తుంటుంది.. కారణమడిగితే కేక పుట్టించే సమాధానమిచ్చింది..

ఆన్‌లైన్ షాపింగ్, విండో షాపింగ్‌లాంటి పద్ధతులలో రూ. 5 లక్షల విలువైన దుస్తులను కేవలం రూ. 50 వేలకే కొనుగోలు చేయవచ్చని ఆమె నిరూపించింది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన విక్టోరియా అదాబీ(55) స్మార్ట్ షాపర్‌గా పేరొందింది. ఆమె దగ్గరున్న డ్రెస్ కలెక్షన్ చూస్తే ఎవరైనాసరే కంగుతినాల్సిందే. అమె దగ్గరున్నవన్నీ అందమైన బ్రాండెడ్ దుస్తులే. వీటిన్నింటినీ ఆమె సగం ధరలకే కొనుగోలు చేసింది. ఆమె ఇలా చేయడం వెనుక ఒక రహస్యముందని చెబుతుంటారు. ఆమె ఈ ఖరీదైన దుస్తులను ఛారిటీ షాప్స్‌లో కొనుగోలు చేస్తుంటారు. వీటిని ఇక్కడ అసలు ధరకన్నా ఎంతో తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఈ దుస్తులను అప్పటికే ఎవరో ఒకరు ధరించి ఉంటారు. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు పిల్లల తల్లి అయిన విక్టోరియా 1989 నుంచి చారిటీ షాపులలోనే దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆమె 500 పౌండ్లు(రూ. 51,269.82) ఖరీదు చేసే దుస్తులను కొనుగోలు చేశారు. వాటి అసలు ఖరీదు 5 వేల పౌండ్లు(రూ. 5,12,698.23) ఉంటుంది. ఈ దుస్తులన్నీ ఆమె వార్డ్‌రోబ్‌లో ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సెకెండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కొని చదువుకునే దానినని తెలిపారు.  అప్పటి నుంచి తనకు ఇటువంటి అలవాటు మొదలయ్యిందని పేర్కొన్నారు. తన దగ్గరున్న దుస్తులలోని 95 శాతం దుస్తులు సెకెండ్ హ్యాండ్‌వేనని తెలిపారు. సెకెండ్ హ్యాండ్ దుస్తుల నుంచి దుర్వాసన వస్తుందని, అయితే దుస్తుల లుక్ అలానే ఉంటుందన్నారు. విక్టోరియా వారంలో రెండుసార్లు చారిటీ షాపింగ్ చేస్తుంటారు. ఇలా దుస్తులను కొనుగోలు చేయడం వలన డబ్బు ఆదా అవుతుందని విక్టోరియా చెబుతుంది. కాగా విక్టోరియాకు మై ట్రెండీ ఫిఫ్టీస్ పేరిట ఇన్‌స్టా‌గ్రామ్‌లో అకౌంట్ ఉంది. దీనిలో ఆమె తన అందమైన ఫొటోలను షేర్ చేస్తుంటారు.

Updated Date - 2021-10-31T15:21:02+05:30 IST