తండ్రి చనిపోయాడు.. భర్త విడాకులిచ్చాడు.. ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది..

ABN , First Publish Date - 2021-12-30T16:33:36+05:30 IST

కోవిడ్ మహమ్మారి కారణంగా పలు..

తండ్రి చనిపోయాడు.. భర్త విడాకులిచ్చాడు.. ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది..

కోవిడ్ మహమ్మారి కారణంగా పలు కంపెనీలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇటువంటి సమయంలో బ్రిటన్‌కు చెందిన క్లెయర్ బర్టన్ కథ భిన్నంగా సాగింది. తండ్రి చనిపోయి, భర్తతో విడాకులు తీసుకుని, రూ. 40 లక్షల జీతం వచ్చే ఉద్యోగం కోల్పోయి  నిస్సహాయ స్థితిలో ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. మరోమార్గంలేక రెండుమూడిళ్లలో క్లీనింగ్ పనులు చేయాల్సివచ్చింది. ‘ది సన్’ రిపోర్టును అనుసరించి.. ఉద్యోగాన్ని కోల్పోయిన క్లెయర్ బర్టన్ ఇన్‌స్టాగ్రామ్‌లో మిసెస్ హించ్‌ స్ఫూర్తిదాయక పోస్టును చూసి, వారానికి నాలుగు గంటలపాటు పనిచేసి, ప్రశాంతగా గడిపే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.


2017లో బర్టన్ తండ్రి లివర్ క్యాన్సర్‌తో చనిపోయాడు. 2018లో భర్త ఆమెకు విడాకులిచ్చాడు. దీంతో ఆమె తీవ్రంగా కుంగిపోయారు. తరువాత ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. దీంతో ఇంటి పరిశుభ్రతా పనులపై ఆమె దృష్టి మళ్లింది. దీంతో ఫుల్ టైమ్ క్లీనర్‌గా మారాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆమె ఆరుగురి ఇళ్లలో పని చేస్తున్నారు. ఇదే ఫుట్ టైమ్ జాబ్‌గా మార్చుకుని మరింతమందికి సేవలు అందిస్తూ ఇప్పుడు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అంతకుముందు 2001లో బర్టన్ ఒక బ్యాంకులో ఉద్యోగం సంపాదించారు. 2003లో ఆమకు డెవ్‌తో వివాహం జరిగింది. 

Updated Date - 2021-12-30T16:33:36+05:30 IST