అర్ధరాత్రి వేళ ఇంట్లో గొడవ పడి బయటికొచ్చిన మహిళ.. దారిలో కారు లిఫ్ట్ తీసుకొని వెళ్లిన ఆమెకు ఏం జరిగిదంటే..

ABN , First Publish Date - 2021-12-28T12:13:15+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఒక మహిళ తన భర్తతో గొడవపడి ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. తన బంధువుల ఇంటికి బయలుదేరిన ఆమెకు దారిలో ఒక కారులో ఇద్దరు కుర్రాళ్లు లిఫ్ట్ ఇచ్చారు..

అర్ధరాత్రి వేళ ఇంట్లో గొడవ పడి బయటికొచ్చిన మహిళ.. దారిలో కారు లిఫ్ట్ తీసుకొని వెళ్లిన ఆమెకు ఏం జరిగిదంటే..

దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఒక మహిళ తన భర్తతో గొడవపడి ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. తన బంధువుల ఇంటికి బయలుదేరిన ఆమెకు దారిలో ఒక కారులో ఇద్దరు కుర్రాళ్లు లిఫ్ట్ ఇచ్చారు. కొంత దూరం వెళ్లాక ఆ కుర్రాళ్లు ఆమెపై అత్యాచారం చేసి ఒక కాలువలో పడేశారు. 


ఆ తరువాత తీవ్ర గాయాలతో ఉన్న ఒక మహిళ కాలువలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కారు వెళ్లిన దారిలో సీసీటీవి వీడియోలను పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2021-12-28T12:13:15+05:30 IST