ట్రక్కుపై డీజే బాక్సులు పెట్టి.. వాటిపై నిలబడి మరీ ఆ కుర్రాళ్ల డాన్స్.. ఒక్క క్షణంలోనే షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2021-12-30T17:59:18+05:30 IST

ఆ కుర్రాళ్లు ఊరేగింపులో ఉత్సాహంగా చిందులేస్తున్నారు.. కొందరు రోడ్లపై చిందులేస్తుండ

ట్రక్కుపై డీజే బాక్సులు పెట్టి.. వాటిపై నిలబడి మరీ ఆ కుర్రాళ్ల డాన్స్.. ఒక్క క్షణంలోనే షాకింగ్ సీన్..!

ఆ కుర్రాళ్లు ఊరేగింపులో ఉత్సాహంగా చిందులేస్తున్నారు.. కొందరు రోడ్లపై చిందులేస్తుండగా.. మరికొందరు  ట్రక్కుపై డీజే బాక్సులు పెట్టి, వాటిపై నిలబడి మరీ డ్యాన్సులేస్తున్నారు.. ఆ సందడిలో వారు ఓ విషయం గమనించలేదు.. అదే విషాదానికి కారణమైంది.. ఓ కుర్రాడి ప్రాణాలు తీసింది.. 11కేవీ హై టెన్షన్ విద్యుత్ వైర్ల కింద నుంచి ట్రక్కు వెళ్తోంది.. ఓ కుర్రాడి చేతులు ఆ వైర్లకు తగలడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు సమీపంలోని కనవార్ గ్రామానికి చెందిన జితేంద్ర అనే యువకుడు బుధవారం సాయంత్రం జరిగిన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నాడు. డీజేకు అనుగుణంగా చిందులేశాడు. కొద్దిసేపటి తర్వాత ట్రక్కుపై అమర్చిన స్పీకర్ బాక్సుల పైకి స్నేహితులతో కలిసి ఎక్కాడు. అక్కడ వారితో కలిసి డ్యాన్సులేశాడు. అయితే అనుకోకుండా అతడి చేయి పైన ఉన్న విద్యుత్ తీగలకు తగలింది. అవి హై-టెన్షన్ విద్యుత్ వైర్లు కావడంతో షాక్ బలంగా తగిలింది. దీంతో ఆ యువకుడు పై నుంచి రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంతవరకు ఉత్సాహంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2021-12-30T17:59:18+05:30 IST