గుడికి వెళ్లొస్తానన్న కూతురు.. రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చిన ఆమెను నిలదీస్తే చెప్పింది విన్న తల్లిదండ్రులకు..

ABN , First Publish Date - 2021-09-02T19:19:51+05:30 IST

కృష్ణాష్టమి సందర్భంగా ఆమె గుడికి వెళ్లింది.. గుడి నుంచి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చింది..

గుడికి వెళ్లొస్తానన్న కూతురు.. రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చిన ఆమెను నిలదీస్తే చెప్పింది విన్న తల్లిదండ్రులకు..

కృష్ణాష్టమి సందర్భంగా ఆమె గుడికి వెళ్లింది.. గుడి నుంచి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చింది.. ఎందుకు ఆలస్యమైందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే కన్నీళ్లతో జరిగిన విషయం మొత్తాన్ని చెప్పింది.. దీంతో ఆ తల్లిదండ్రులు పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు.. అక్కడ న్యాయం జరగదని తేలడంతో పోలీసులను ఆశ్రయించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.. బీహార్‌లోని ఖగారియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ఖగారియా ప్రాంతానికి చెందిన బాధిత యువతి కృష్ణాష్టమి సందర్భంగా గత సోమవారం సాయంత్రం గుడికి వెళ్లింది. గుడి నుంచి తిరిగి వస్తుండగా అక్షయ్, గోలు, కుమార్ అనే వ్యక్తులు ఆమెను నిర్బంధించారు. దూరంగా తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. ఆ యువతి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం మొత్తం చెప్పింది. తర్వాతి రోజు తల్లిదండ్రలు పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు. 


విషయం విన్న పంచాయితీ పెద్దలు అత్యాచారానికి పాల్పడిన యువకులను శిక్షించకుండా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. దీంతో యువతి తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. యువతి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-09-02T19:19:51+05:30 IST