భార్య గ్రీన్ సిగ్నల్.. 7 నెలల గర్భవతి అయిన 23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్న భర్త.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-09-03T20:57:44+05:30 IST

అతడి పేరు పవిత్ర సింగ్ బేడీ.. వయసు 45 సంవ్సతరాలు.. ఛత్తీస్‌గఢ్ విద్యాశాఖలో ఓ అధికారి..

భార్య గ్రీన్ సిగ్నల్.. 7 నెలల గర్భవతి అయిన 23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్న భర్త.. అసలు కథేంటంటే..

అతడి పేరు పవిత్ర సింగ్ బేడీ.. వయసు 45 సంవ్సతరాలు.. ఛత్తీస్‌గఢ్ విద్యాశాఖలో ఓ అధికారి.. అతనికి ఇప్పటికే పెళ్లి జరిగి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి.. తాజాగా అతను 23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.. మొదటి భార్య సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది.. తప్పనిసరి పరిస్థతుల్లోనే ఈ పెళ్లికి మొదటి భార్య అంగీకరించింది.. ఈ పెళ్లికి మొదటి భార్య ఎందుకు అంగీకరించిందంటే.. 


బిల్హా విద్యాశాఖ కార్యాలయంలో బీఈవోగా పవిత్ర సింగ్ పనిచేస్తున్నాడు. అతడికి 20 ఏళ్ల క్రితం సుధా కౌర్ అనే మహిళతో వివాహం జరిగింది. కాగా పవ్రిత సింగ్ ఉద్యోగంలో భాగంగా బిల్హాకు వెళ్లిన తర్వాత ఓ మైనర్ బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడేళ్లుగా ఆమెతో శారీరక సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. ఫలితంగా ఇటీవల ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చిన ఏడు నెలల తర్వాత ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పవిత్ర సింగ్‌పై రేప్ కేస్ పెట్టింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి పవిత్ర సింగ్ తనను శారీరకంగా ఉపయోగించుకున్నాడని ఫిర్యాదు చేసింది. 


బాధిత మహిళ చెప్పింది విన్న పోలీసులు పవిత్ర సింగ్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. బాధిత యువతిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అప్పటికే వివాహితుడైన పవిత్ర సింగ్ రెండో పెళ్లి గురించి తన మొదటి భార్యతో మాట్లాడాడు. పెళ్లి చేసుకోకపోతే భర్త జైలుకెళ్లాల్సి ఉంటుందని తెలియడంతో సుధాకౌర్ రెండో పెళ్లికి అంగీకరించింది. దీంతో మొదటి భార్య సమక్షంలోనే పవిత్ర సింగ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఫిర్యాదు చేయలేదు కాబట్టి.. రెండో పెళ్లి విషయంలో ఇబ్బందులు ఉండవని పోలీసులు చెబుతున్నారు.  

Updated Date - 2021-09-03T20:57:44+05:30 IST