ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. చివరకు ఆమె అలా చేస్తుందని తెలుసుకోలేకపోయాడు..

ABN , First Publish Date - 2022-01-01T00:00:23+05:30 IST

కేరళలో ఓ మహిళకు సోషల్ మీడియాలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. ఓ రోజు ఇంటికి పిలిచింది. అయితే తర్వాత ఆమె చేసిన నిర్వాకానికి ఆ యువకుడు షాక్ అయ్యాడు... వివరాల్లోకి వెళితే..

ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. చివరకు ఆమె అలా చేస్తుందని తెలుసుకోలేకపోయాడు..

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యాక.. మనుషుల మధ్య దూరం చాలా దగ్గింది. ఎంత దూరంలో ఉన్నా ఒక్క క్లిక్‌తో హాయ్.. అంటూ ప్రత్యక్షమవుతుంటారు. అయితే ఈ మార్పుల వల్ల ఎంత ప్రయోజనం ఉందో.. అంతే నష్టం కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా.. అనుకుంటూ మోసగాళ్లు పొంచి ఉంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అకౌంట్‌లోని నగదును ఖాళీ చేసేస్తారు. కేరళలో ఓ మహిళకు సోషల్ మీడియాలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. ఓ రోజు ఇంటికి పిలిచింది. అయితే తర్వాత ఆమె చేసిన నిర్వాకానికి ఆ యువకుడు షాక్ అయ్యాడు... వివరాల్లోకి వెళితే..


కేరళలోని త్రిసూర్‌లో సింధు(37) అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమెకు ఫిబ్రవరిలో పాలక్కాడ్ చంద్రనగర్‌కు చెందిన ఓ యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. రోజూ చాటింగ్, వీడియో కాల్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల ఓరోజు యువకుడని  త్రిసూర్‌లోని తన ఇంటికి పిలిచింది. దీంతో యువకుడు ఏమాత్రం ఆలోచించకుండా.. వెంటనే ఆమె ఇంట్లో వాలిపోయాడు. తర్వాత ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఆమె నిజస్వరూపం బయటపడింది.

35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే..


ఫోన్ తీసుకుని పోలీసులకు కాల్ చేస్తున్నా అంటూ బెదిరించింది. ఒంటి మీదున్న బంగారు, ఉంగరాలు ఇవ్వాలని.. లేదంటే తనను లైంగికంగా వేధిస్తున్నావని పోలీసుకు చెబుతా అంటూ ప్లేట్ మార్చింది. పరువు పోతుందనే భయంతో ఆ యువకుడు.. తన బంగారం మొత్తం ఆమెకు ఇచ్చి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు మళ్లీ అతడికి ఫోన్ చేసి.. ‘‘ నన్ను క్షమించు, నేను కావాలని అలా చేయలేదు.. డైరెక్ట్‌గా కలిస్తే బంగారు ఇవ్వడంతో పాటూ అసలు విషయం మొత్తం చెబుతా’’.. అంటూ నమ్మించింది. మరోసారి ఆమె మాటలు నమ్మిన యువకుడు మళ్లీ ఓ లాడ్జిలో ఆమెను కలుసుకున్నాడు.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


అక్కడ అతనికి మాయమాటలు చెబుతూ నగ్నంగా మార్చింది. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. తర్వాత కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ వీడియోలు అందరికీ పంపుతా అంటూ బెదిరించి.. రూ.1,75,000లు రాబట్టింది. అంతటితో ఆగకుండా మరో రూ.పది లక్షలు డిమాండ్ చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు త్రిసూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ద్వారా మహిళకు ఫోన్ చేయించిన పోలీసులు.. ఆమె అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా..

Updated Date - 2022-01-01T00:00:23+05:30 IST