నాకు కాస్త భయంగా ఉంది ప్లీజ్.. అంటూ శోభనాన్ని వాయిదా వేసిన నవవధువు.. సరే అని ఒప్పుకున్న భర్తకు మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2021-10-28T21:31:07+05:30 IST

రాజస్థాన్‌లో ఓ వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అయితే శోభనం రోజు భార్య అభ్యంతరం తెలిపింది. తనకు భయంగా ఉందని, కొన్ని రోజులు శోభనాన్ని వాయిదా వేద్దామని చెప్పింది. భార్య మాటకు విలువ ఇచ్చిన ఆ భర్త.. సరే అని ఒప్పుకొన్నాడు.

నాకు కాస్త భయంగా ఉంది ప్లీజ్.. అంటూ శోభనాన్ని వాయిదా వేసిన నవవధువు.. సరే అని ఒప్పుకున్న భర్తకు మైండ్‌బ్లాక్..!

మన దేశంలో వివాహ బంధానికి ఎంతో విలువ ఇస్తారు. ఒక్కసారి పెళ్లి అయితే.. జీవితాంతం అదే బంధానికి కట్టుబడి ఉంటారు. అయితే రాను రాను కొన్ని చోట్ల వివాహ బంధాన్ని కూడా కొందరు ఆదాయ వనరుగా మార్చుకుని, అపహాస్యం చేస్తున్నారు. దంపతుల్లో ఎవరో ఒకరు చేసే తప్పుల కారణంగా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతూ ఉన్నాయి. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అయితే శోభనం రోజు భార్య అభ్యంతరం తెలిపింది. తనకు భయంగా ఉందని, కొన్ని రోజులు శోభనాన్ని వాయిదా వేద్దామని చెప్పింది. భార్య మాటకు విలువ ఇచ్చిన ఆ భర్త.. సరే అని ఒప్పుకొన్నాడు. ఎనిమిది రోజులవుతున్నా అలాగే చెబుతూ వస్తోంది. అయితే తర్వాత తన భార్య గురించి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌‌లో నివాసం ఉంటున్న బాబూరామ్ అనే యువకుడు ఇటీవల శాంతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. శోభనం రోజు రాగానే భార్య కంగారుపడింది. తనకు భయంగా ఉందని, కొన్నాళ్లు సమయం కావాలని భర్తతో విన్నవించుకుంది. భర్త కూడా తనను అర్థం చేసుకుని సరే అని అంగీకరించాడు. రోజూ అదే మాట చెబుతూ వచ్చింది. భయంగా ఉందేమో అనుకుని భర్త కూడా బలవంతం చేయలేదు. ఎనిమిది రోజుల తర్వాత ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆస్పత్రికి వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడిన భర్త పలుమార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. ఇంటికి వెళ్లి చూసిన బాబూరామ్‌కు మైండ్ బ్లాక్ అయింది.


ఇంట్లో డబ్బు, నగలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో భార్యపై అనుమానం వచ్చింది. తనకు సంబంధం చూసిన జగ్మల్ సింగ్ అనే వ్యక్తికి ఫోన్ చేశాడు. అయితే అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ అని రావడంతో పూర్తి క్లారిటీ వచ్చింది. కేవలం నగలు, డబ్బుల కోసమే తనకు సంబంధం అంటగట్టి, మోసం చేశారని తెలుసుకున్నాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో డబ్బు, నగలు దోచుకుపోయే ముఠాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫొటోల ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-28T21:31:07+05:30 IST