ఆ కుక్కంటే యజమానికి చాలా ఇష్టం.. ఇంట్లో ఉంచుకోవద్దన్న తల్లి.. కుక్కను వదిలి ఉండలేక చివరకు..

ABN , First Publish Date - 2022-01-01T02:14:42+05:30 IST

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కపై అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆ కుక్కకు కూడా యజమాని అంటే ఎంతో ఇష్టం. నిత్యం ఆ వ్యక్తి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అయితే...

ఆ కుక్కంటే యజమానికి చాలా ఇష్టం.. ఇంట్లో ఉంచుకోవద్దన్న తల్లి.. కుక్కను వదిలి ఉండలేక చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

కుక్కకు ఉన్న విశ్వాసం.. మనుషుల్లో ఉండదంటారు. ఓ ముద్ద అన్నం పెట్టినా.. జీవితాంతం యజమానిని కాచుకుని ఉంటాయి. అందుకే ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లో ఓ పెంపుడు కుక్క ఉండడం సాధారణమైంది. లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను కొనడం చూస్తుంటాం. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి కూడా తన పెంపుడు కుక్కపై అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆ కుక్కకు కూడా యజమాని అంటే ఎంతో ఇష్టం. నిత్యం ఆ వ్యక్తి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అయితే అతడి తల్లికి మాత్రం ఆ కుక్కంటే ఇష్టం లేదు. దీంతో బయట వదిలేయమని చెప్పింది. అయితే దాన్ని విడిచి ఉండాల్సి వస్తుందనే బాధలో అతడు తీసుకున్న నిర్ణయం.. అందరినీ షాక్‌కు గురి చేసింది..


మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌(Chattarpur) లోని విశ్వనాథ్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కుక్కలంటే చాలా ఇష్టం. ప్రస్తుతం అతను ఓ కుక్కను ఎంతో ప్రేమతో పెంచుతున్నాడు. ఆ కుక్కకు కూడా యజమాని అంటే చాలా అభిమానం. ఎక్కడికి వెళ్లినా వెనుకే వెళ్తుంది. ఆఖరికి రాత్రి నిద్రపోతున్నా, పక్కనే ఉంటుంది. వారిద్దరి మధ్య అంతగా అనుభందం ఏర్పడ్డ సందర్భంలో ఓ రోజు అనుకోని ఘటన ఎదురైంది. ఓ రోజు అతడి తల్లి కుక్కను బయట వదిలేయమని చెప్పింది. దీంతో ఆ కుక్క ఆమె చేతిని కరిచింది. దీంతో వృద్ధురాలు దానిపై ఇంకా కోపం పెంచుకుంది. ఎలాగైనా దాన్ని బయట వదిలేయాల్సిందే అని పట్టుబట్టింది.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


కుక్కను వదిలేయడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు. అలాగని తల్లి మాటకు ఎదురు చెప్పలేడు. దీంతో లోలోపల చాలా సతమతమయ్యాడు. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త విన్న స్థానికులంతా షాక్‌కు గురయ్యారు. ఆ కుక్క కూడా యజమాని దగ్గరకు వెళ్లి.. లేవమని కాలితో పదే పదే తట్టడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. యజమాని అంత్యక్రియలు ముగిసేవరకూ పక్కనే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెంపుడు కుక్క కోసం యజమాని ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడా చూడలేదంటూ అంతా కన్నీటిపర్యంతమయ్యారు.

35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే..

Updated Date - 2022-01-01T02:14:42+05:30 IST