ఆవును పెళ్లి చేసుకున్న అవ్వ.. ఏంటవ్వా ఈ పని అని అడిగితే.. ఆమె చెప్పిన కారణం విని అంతా షాక్..

ABN , First Publish Date - 2021-11-29T02:10:21+05:30 IST

కంబోడియాకు చెందిన ఓ అవ్వ చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. 74ఏళ్ల ఓ వృద్ధురాలు.. ఓ ఆవును పెళ్లి చేసుకుంది. ఏంటవ్వా ఈ పని అంటే.. ఆమె చెప్పిన సమాధానం విని అంతా షాక్ అయ్యారు...

ఆవును పెళ్లి చేసుకున్న అవ్వ.. ఏంటవ్వా ఈ పని అని అడిగితే.. ఆమె చెప్పిన కారణం విని అంతా షాక్..
ఆవుతో వృద్ధురాలు

కొందరి నమ్మకాలు వింటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మూఢ నమ్మకాల మీద విశ్వాసంతో చాలా మంది వింత వింత పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు సైతం పొగొట్టుకుంటూ ఉంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా చూశాం. కంబోడియాకు చెందిన ఓ అవ్వ చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. 74ఏళ్ల ఓ వృద్ధురాలు.. ఓ ఆవును పెళ్లి చేసుకుంది. ఏంటవ్వా ఈ పని అంటే.. ఆమె చెప్పిన సమాధానం విని అంతా షాక్ అయ్యారు...


కంబోడియాలోని క్రతి ప్రావిన్స్‌కు చెందిన ఖిమ్ హాంగ్(74) అనే వృద్ధురాలు.. ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వ్యవసాయం, పశుపోషణ ద్వారా కుటుంబాన్ని పోషిస్తోంది. తన ఆవుకు ఇటీవల ఓ దూడ పుట్టింది. అదంటే వృద్ధురాలికి ఎంతో ప్రేమ ఉండేది. రోజులో ఎక్కువ సమయం ఆవుతోనే గడిపేది. ఇటీవల ఆవు దూడ పెద్దదైంది. దీంతో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇస్తూ.. దూడను పెళ్లి చేసుకుంది. అదికూడా బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకుంది.


ఏంటవ్వా ఇలాంటి పని చేస్తున్నావని కొందరు స్థానికులు అడగ్గా.. అందులో నా భర్త కనిపిస్తున్నాడంటూ సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన భర్త చూపించినట్లుగానే ఆవు కూడా తనపై ఎంతో ప్రేమ చూపిస్తోందని చెప్పింది. దీంతో ఆవులో తన భర్తను చూసుకుంటున్నట్లు తెలిపింది. తన భర్త ఆవు రూపంలో మళ్లీ జన్మించాడని చెబుతోంది. తాను చనిపోయినా ఆవును మాత్రం తండ్రిగా చూసుకోవాలని పిల్లలకు సూచించిందట. పెళ్లికి సంబంధించిన వీడియోలు లేకపోయినా.. స్థానికుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2021-11-29T02:10:21+05:30 IST