-
-
Home » Prathyekam » What he did to his cousin was to have an extramarital affair spl-MRGS-Prathyekam
-
వారిద్దరూ అన్నదమ్ముల కొడుకులు.. ఒకరి బంధువుతో మరో వ్యక్తి రాసలీలలు.. చివరకు ఏమరపాటులో ఉండగా ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-12-06T00:51:04+05:30 IST
ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోతాయంటారు.. ఈ సామెతకు తగ్గట్టుగా ఓ మహిళ కారణంగా ఇద్దరు మగవారి మధ్య వివాదం జరిగింది. వారిద్దరూ స్వయానా అన్నదమ్ముల కొడుకులు. అయితే ఒకరి బంధువైన మహిళతో మరో వ్యక్తి...

ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోతాయంటారు.. ఈ సామెతకు తగ్గట్టుగా ఓ మహిళ కారణంగా ఇద్దరు మగవారి మధ్య వివాదం జరిగింది. వారిద్దరూ స్వయానా అన్నదమ్ముల కొడుకులు. అయితే ఒకరి బంధువైన మహిళతో మరో వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆనోటా, ఈనోటా పడి చివరికి రెండో వ్యక్తి తెలిసింది. దీంతో తలెత్తిన వివాదం చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..
తెలంగాణలోని ఆసిఫాబాద్ పరిధి రెబ్బెన మండలంలోని నవేగాంకు చెందిన వేల్పుల ఇందూర్(18), రాజలింగు.. అన్నదమ్ముల కొడుకులు. దగ్గరి బంధువులు కావడంతో కలిసిమెలసి ఉండేవారు. ఈ క్రమంలో రాజలింగు బంధువులైన మహిళతో ఇందూర్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎవరికీ తెలీకుండా కలుసుకునేవారు. అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి చివరికి రాజలింగు వరకు చేరింది. తమ బంధువుల మహిళతోనే అక్రమ పెట్టుకున్నాడని తెలియడంతో ఇందూర్‌పై కోపం పెంచుకున్నాడు. పద్ధతి మార్చుకోవాలని ఒకటి, రెండుసార్లు హెచ్చరించాడు. కానీ ఇందూర్ మాత్రం ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు.
భర్తతో సుఖం దొరకలేదని.. పరాయి మగవారిపై మనసు పడింది.. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రాగానే..
ఈ క్రమంలో ఇందూర్‌ను ఎలాగైనా అంతమొందిచాలని రాజలింగు నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 1న ఇందూర్.. తన ఇంటి బయట కాళ్లు కడుక్కుంటున్నాడు. ఏమరపాటులో ఉన్నాడని గ్రహించిన రాజలింగు.. కత్తితో ఒక్కసారిగా అతడిపై దాడికి పాల్పడ్డాడు. కడుపులో బలంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి మధునయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్, రెబ్బెన సీఐ సతీష్‌కుమార్, ఎస్‌ఐ భవానీసేన్ పేర్కొన్నారు.