వచ్చిన ప్రతీ పెళ్లి సంబంధానికి నో చెప్తున్న అక్క.. అర్థం చేసుకోకుండా తమ్ముడే ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు..!

ABN , First Publish Date - 2021-12-21T22:06:06+05:30 IST

తమిళనాడులో ఓ యువతి, వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉండేది. మధ్యలో ఆమె సోదరుడు ఎంటరై.. విషయం తెలుసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే..

వచ్చిన ప్రతీ పెళ్లి సంబంధానికి నో చెప్తున్న అక్క.. అర్థం చేసుకోకుండా తమ్ముడే ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు..!
నిందితుడు శరవణన్

ప్రేమలో ఉండే యువతులు.. ఆ విషయాన్ని అటు ఇంట్లో చెప్పలేక, ఇటు ప్రేమించిన వాడితో వెళ్లిపోలేక.. మధ్యలో సతమతమవుతూ ఉంటారు. ఈ విషయం తెలీని తల్లిదండ్రులు, కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. తీరా పెళ్లి దగ్గరపడే క్రమంలో.. కొందరు యువతులు అసలు విషయం బయటపెడతారు. వారి నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తే.. మరికొందరు అసలు ఒప్పుకోరు. ఈ క్రమంలో చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకోవడమో.. తెగించి ఇష్టపడిన వారితో వెళ్లిపోవడమో చేస్తుంటారు. తమిళనాడులో ఓ యువతి, వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉండేది. మధ్యలో ఆమె సోదరుడు ఎంటరై.. విషయం తెలుసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే..


తమిళనాడులోని రామనాథపురం నెహ్రునగర్‌ 5వ వీధిలో సెల్వం అనే వ్యక్తి.. భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుతో నివాసం ఉంటున్నాడు. ఇతను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ వెడ్డింగ్ మహల్‌లో మేనేజర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కూతురు స్వాతి(27)కి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. అయితే తనకు ఇష్టం లేదంటూ తిరస్కరించింది. కొన్నాళ్లకు మళ్లీ ఇంకో సంబంధం తీసుకొచ్చారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఇలా వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తూ ఉండడంతో తండ్రి సెల్వంకు కోపం వచ్చింది. ఈ విషయంలో ఆమెకు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో స్వాతి పిన్ని కుమారుడు శరవణన్ అక్కడికి వచ్చాడు.

అతడి మీదకు అమాంతం దూకేసిన సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..


‘‘అక్కా.. మంచి సంబంధం.. ఒప్పుకో’’.. అంటూ స్వాతికి నచ్చజెప్పాడు. ఈ క్రమంలో ఆమె ప్రేమ విషయాన్ని తమ్ముడితో చెప్పింది. అతన్ని తప్ప వేరే వారిని చేసుకోనని చెప్పింది. సోదరి ప్రియుడి వివరాలు తెలుసుకున్న శరవణన్.. అందుకు ఒప్పుకోలేదు. ‘‘అతడిది తక్కువ కులం.. పెళ్లి చేసుకుంటే మన పరువు పోతుంది’’.. అంటూ గట్టిగా మందలించాడు. అయినా స్వాతి ఒప్పుకోకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఓ రోజు స్వాతి ఒక్కటే ఇంట్లో ఉండగా.. శరవణన్ వెళ్లాడు. ఇదే విషయమై మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శరవణన్.. స్వాతి గొంతు కోసి పరరాయ్యాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు రోజుల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

అమ్మాయ్.. లే.. లే.. పెళ్లికొడుకు తాళి కడతాడట..! వధువుపై ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు

Updated Date - 2021-12-21T22:06:06+05:30 IST